వంశీ ఆస్తులు బయటపెట్టిన కొడాలి నాని..! ఎన్ని వేల కోట్లో తెలుసా ?

కృష్ణాజిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని త్రయం మధ్య స్నేహం గురించి రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వారందరికీ తెలుసు. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నా ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరిపోయిన ఈ ముగ్గురూ కొన్నేళ్లుగా కలిసే రాజకీయాలు చేస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వల్లభనేని వంశీపై కూటమి సర్కార్ గతేడాది వరుసగా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపింది. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన వంశీ ప్రస్తుతం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఆయనపై పెట్టిన కేసులతో పాటు ఆయన ఆస్తుల గురించి కొడాలి నాని (Kodali Nani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొడాలి నానికి సర్కార్ షాక్..! చనువుగా ఉన్న ఎస్సైపై వేటు..!
కొడాలి నానికి సర్కార్ షాక్..! చనువుగా ఉన్న ఎస్సైపై వేటు..!

తన స్నేహితుడు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) గురించి వైఎస్సార్సీపీ కార్యకర్తల భేటీలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ ఆస్తుల వివరాలు ఆయన అనుమతితోనే కొడాలి బయటపెట్టారు. వంశీకి హైదరాబాద్ లో 200 ఎకరాల పొలం ఉందని, ఇందులో ఎకరం 50 కోట్లని తెలిపారు. ఈ లెక్కన 10 వేల కోట్ల ఆస్తిపరుడు వంశీ అని కొడాలి వెల్లడించారు. అలాంటి వ్యక్తి గ్రావెల్ అమ్ముకున్నాడు, పేదల ఇళ్లపట్టాలు అమ్ముకున్నాడని కేసులు పెడతారా అంటూ కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులకు, వేధింపులకు బెదిరేది లేదని కూటమి సర్కార్ కు కొడాలి తేల్చిచెప్పేశారు.

Kodali Nani Defends Vallabhaneni Vamsi Reveals Assets and Hits Out at False Cases

వల్లభనేని వంశీ డిమాండ్ నెరవేర్చిన చంద్రబాబు..! ఫుల్ హ్యాపీ..!
వల్లభనేని వంశీ డిమాండ్ నెరవేర్చిన చంద్రబాబు..! ఫుల్ హ్యాపీ..!

ఇదే క్రమంలో వంశీ తర్వాత నెక్స్ట్ తన వంతే అని కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొడాలిపై పలు కేసులు నమోదు చేసిన కూటమి సర్కార్.. ఏ కేసులోనూ అరెస్టు చేసి జైల్లో పెట్టలేకపోయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తనను అరెస్టు చేస్తారనే అర్దం వచ్చేలా కొడాలి నాని వ్యాఖ్యలు ఉన్నాయి. అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ చోటా పోటీ చేయాలన్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రంగంలోకి దిగుతున్నట్లు తెలిపారు. విజయమో, వీరస్వర్గమో తేల్చుకుంటామని ఈ సందర్భంగా కొడాలి నాని సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+