వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చట్టసభల్లో ప్రవర్తనా నియమావళి: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో హుందాతనం లోపించడం పట్ల, ప్రవర్తనదెబ్బ తినడం పట్ల ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రవర్తనా నియమావళి రూపకల్పనకు ముందుకు రావాలని ఆయన రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. శాసనసభల్లో క్రమశిక్షణ, ప్రవర్తన అనేఅంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆదివారం ఆయన ప్రసంగించారు.

ప్రవర్తనా నియమావళిని రూపొందించి దానికి తప్పనిసరిగా కట్టుబడి వుండేలా చూడాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు. సంకీర్ణ రాజకీయాల కాలం సాగుతున్న ప్రస్తుత తరుణంలో భిన్న అభిప్రాయాలను సభలో సామరస్యపూర్వకంగా వ్యక్తం చేయడానికి అవకాశం కల్పించేందుకు ప్రవర్తనా నియమావళి రూపకల్పన తప్పని సరిఅయిందని ఆయన అన్నారు.

అధికార, ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటు, శాసనసభల హుందాతనాన్ని కాపాడాలని, ప్రజాస్వాుక లువలుదెబ్బ తినే చర్యలకు ప్రతిపక్షాలు దిగకూడదని ఆయన అన్నారు. ఈ సమావేశాన్ని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ ప్రారంభించారు. లోక్‌సభస్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X