దేశం నేతలకు సంపూర్ణ అవగాహన
హైదరాబాద్: శిక్షణ పొంది తెలుగుదేశం నాయకులు సంపూర్ణ అవగాహనతో గ్రామాలకు వెళ్తారని పార్టీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మూడు జిల్లాల్లోని 13 శాసనసభా నియోజక వర్గాల నాలుగవ బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల శిక్షణా శిబిరం ఆదివారంనాడిక్కడ జరిగింది. ఈ శిబిరంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నియోజక వర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. శిక్షణా శిబిరాల్లో తమ పార్టీ నేతలతోనే కాకుండా బయటి వారితో కూడా ప్రసంగాలు ఇప్పిస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications