జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లా సురన్‌కోట్‌పర్వత ప్రాంతంలో మంగళవారం మిలిటెంట్లకు, భారత భద్రతా బలగాలకు మధ్య జరిగిన హోరాహోరి ఎదురు కాల్పుల్లో 14 మంది మరణించారు. మరణించినవారిలో 8 మందిమిలిటెంట్లు, ఆరుగురు భారత భద్రతా జవాన్లు, ఇద్దరు ఆర్మీ అధికారులు వున్నారు.
భారత బృందాల నిఘా జవాన్లు సురన్‌కోట్‌పర్వత ప్రాంతంలో పై ప్రాంతాలకు చేరుకుంటున్న సమయంలోమిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. కాక హిల్స్ సమీపంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలోమిలిటెంట్లు ఈ మెరుపుదాడి చేశారు.
ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మిలిటెంట్లు, ఆరుగురు భద్రతా జవాన్లు అక్కడికక్కడే మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈవిషయం తెలిసిన వెంటనే మరిన్ని భారత బలగాలు అక్కడికి చేరుకున్నాయి. చివరి వార్తలు అందేవరకు కూడా ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతూనే వున్నాయి.












Click it and Unblock the Notifications
