హైదరాబాద్‌: మంత్రి వర్గం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనను తొలగించినందుకు తనకేమీ అసంతృప్తి లేదని హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌ శాసనసభ్యుడు కృష్ణయాదవ్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని నారాయణగుడాఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణయాదవ్‌ అనుచరులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, మంత్రులను నెట్టేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది కావాలని చేసింది కాదని, యాదృచ్ఛికంగా జరిగిందని కృష్ణయాదవ్‌వివరణ ఇచ్చారు. ఏ విధమైన ఆరోపణలు లేనప్పటికీ తనను మంత్రి వర్గం నుంచి తొలగించినందుకు పార్టీ కార్యకర్తలు ఉద్రేకం చెందారని, ఆవేశంలో ఆ విధంగా వ్యవహరించారని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయానికి కట్టుబడి వుంటానని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంలో, గొడవ చేయడంలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పారు. కార్యకర్తలు ఎవరేమన్నారో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+