ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రతిపక్షాల ధ్వజం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగావున్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తున్నదని ప్రతిపక్షాలు బుధవారం నాడు అసెంబ్లీలో ధ్వజమెత్తాయి. ఈ విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణాన్ని స్వీకర్ అనుమతించక పోవటంతో కాంగ్రెస్ సభ్యులు ప్లేకార్డ్స్ ప్రదర్శిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇలాంటి ప్రజాసమస్యలను చర్చించేందుకు అసెంబ్లీని మరికొద్ది రోజులు పొడిగించాలని సీఎల్పీ నేత వైఎస్ .రాజశేఖరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరుద్యోగులు ఇప్పుడు ఆమరణదీక్షలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులను ఆదుకోవాలని సిపిఎం సభాపక్ష నాయకుడు నోముల నర్సింహయ్య డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ విషయమై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించటంతో ప్రతిపక్ష సభ్యులు శాం
తించారు.












Click it and Unblock the Notifications
