నిరుద్యోగుల ఆమరణ దీక్ష ప్రారంభం Home Full Story
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీగా వున్న 1500 ఎగ్జిక్యూటివ్ కేడర్ గ్రూప్-2 డైరెక్టు రిక్రూట్‌మెంట్ పోస్టులను భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు చెందిన నిరుద్యోగులు మంగళవారం నుంచి హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దాదాపు పది సంవత్సరాలకు 1999 డిశెంబర్ 29న గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందని, పదేళ్లుగా భారీగా ఖాళీలు వుండటంవల్ల సుమారు మూడు లక్షల మంది నిరుద్యోలుగు ఈ పరీక్షలకు హాజరయ్యారని, అయితే ప్రభుత్వం మాత్రం 104 పోస్టులు మాత్రమే భర్తీచేసి నిరుద్యోగుల కడుపు కొట్టిందని నిరుద్యోగ పోరాట కమిటీ నాయకులు ఆరోపించారు.
ఈ నేపద్యంలో తాము ఆమరణదీక్షలు ప్రారంభించాల్సి వచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికయినా సరైన విధంగా స్పందించకుంటే తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
