సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పులు
న్యూఢిల్లీ : భారత్, పాక్ సరిహద్దుల్లో భారత్, పాక్ సేనల మధ్య కాల్పులు కొనసాగుతూనే వున్నాయి. మంగళవారం రాత్రి పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, ఇద్దరు పౌరులు కూడా మరణించినట్టు భారత్ ప్రకటించగా, భారత్ ప్రకటనను పాక్ త్రోచిపుచ్చుతూ భారత్ కాల్పులలో తమ దేశ పౌరులే ఇద్దరు మృతి చెందనట్టు ప్రకటించింది.
కాగా, సరిహద్దులను దాటుతున్న ఐదుగురు మిలిటెంట్లను భారత సైన్యం కాల్చి చంపింది. ఇది ఇలావుండగా, పాక్ వైఖరిపై భారతదేశ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బుధవారం నాడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సిసిఎస్) సమావేశం అవుతోంది. పాక్‌ఎడల భారత్ అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
