ముగిసిన విశాఖ ఉత్సవం
విశాఖపట్నం: నాలుగు రోజుల పాటు విశాఖ వాసులను, విశాఖను సందర్శించిన పర్యాటకులను విశేషంగా అలరించిన విశాఖ ఉత్సవ్ ముగిసింది. చివరి రోజైన మంగళవారం నాడు ఉత్సవ కేంద్రమైన రామకృష్ణా బీచ్ ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడింది. పర్యాటకులు, నగరవాసులు పెద్ద ఎత్తును తరలి వచ్చారు. రాజకీయ ప్రముఖులు, అధికారులు ఎప్పటిలాగే విశాఖకు వరాలు కురిపించారు. విశాఖను ప్రపంచ సుందరిగా తీర్చుదిద్దుతాం. విశాఖ ప్రకృతి ప్రసాదించిన అందాలతో ఇప్పటికే ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.
మా ప్రభుత్వం విశాఖను మరింతగా తీర్చేదిద్దేందుకు కృషి చేస్తోంది. విశాఖ విమానాశ్రాయాన్ని ఆధునీకరిస్తున్నాం. అలాగే వైజాగ్ - చెన్నై, వైజాగ్ భువనేశ్వర్ ల మధ్య ఓవర్ నైట్ రైళ్ళు నడపడానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి టి.దేవేందర్ గౌడ్ అన్నారు. టీడీపీపీ నేత ఎర్నన్నాయుడు కూడా బోల్డన్ని వరాలు కురిపించాడు. అనంతరం విశాఖ సావనీరును ఆవిష్కరించారు. సభ ప్రారంభానికి ముందు నేవల్ ఫోర్స్ ప్రదర్శించిన విన్యాసాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications
