బిజెపి, మజ్లిస్ తొలిజాబితా విడుదల
హైదరాబాద్‌ః హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పర్వం ఊపందుకుంది. గురువారం నాడు భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేశాయి. శుక్రవారం సాయంత్రానికి మేయర్ అభ్యర్థిని ఖరారు చేస్తామని మజ్లిస్ ఎమ్మెల్ల్యే అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. 25 మంది కార్పొరేటర్ల తొలిజాబితాను ఆయన విడుదల చేశారు. విద్యావంతులు, పలుకుబడి గలవారికి మజ్లిస్ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్న భారతీయ జనతా పార్టీ గురువారం నాడు 24 మంది కార్పొరేటర్ల పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది. డిప్యూటీ మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తమకు వదలివేసిన దరిమిలా అందుకోసం సమర్ధుడైన అభ్యర్ధికోసం వేటాడుతున్నట్లు బిజెపి వెల్లడించింది. శుక్రవారం సాయంత్రానికి మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు బిజెపి సన్నాహాలు చేస్తున్నది.












Click it and Unblock the Notifications