న్యూఢిల్లీః బ్రిటన్ ప్రధాని టోని బ్లెయిర్ తన అర్ధాంగి చెర్రీ సమేతంగా సోమవారం నాడు రాజ్‌ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీ సమాధివద్ద పుష్పగుచ్ఛాలు వుంచి నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లో ఆయన పదినిమిషాలపాటు గడిపారు.
భారత్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించిన బ్లెయిర్ సోమవారం నాడు పాకిస్తాన్‌కు బయలుదేరి వెళ్లారు. పాక్ బయలుదేరి వెళ్లేముందు రాష్ట్రపతి కెఆర్ నారాయణన్‌ను ఆయన రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆయన అరగంటపాటు గడిపారు. విదేశాంగ శాఖ కార్యదర్శి చోకిలా అయ్యర్, బ్రిటన్‌లో భారత హై కమిషనర్‌గా వున్న నరేష్ దయాళ్ ఢిల్లీలో బ్రిటన్ రాయబారిగా వున్న సర్ రాబ్ యంగ్ కూడా బ్లెయిర్ దంపతులతో పాటు వున్నారు. రాష్ట్రపతిని కలసిన తర్వాత ఆయన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానంలో పాకిస్తాన్ బయలుదేరి వెళ్లారు. బ్రిటన్నుంచి బ్లెయిర్ దంపతులను తీసుకుని వచ్చిన అధికార బోయింగ్ విమానం ఢిల్లీలోనే వుంది. మంగళవారం నాడు రాయల్ ఎయిర్ పోర్స్ విమానంలో ఢిల్లీ వచ్చి అక్కడినుంచి బోయింగ్‌లో లండన్ బయలుదేరి వెళ్లుతారు.