అమెరికాకు బయలుదేరిన అద్వానీ

ముంబాయి: ఆరు రోజుల అమెరికా పర్యటనకు కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఉగ్రవాదంపై చేసే దీర్ఘ కాలిక పోరుకు ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఆయన పర్యటన చేస్తున్నారు.

అమెరికాకు అధికార పర్యటన చేస్తున్న తొలి భారత హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ. ఆయన మంగళవారం ఉదయం గం. 7.45 నిమిషాలకు ఎయిర్‌ ఇండియా ఫ్లయిట్‌లో అమెరికాకు బయలుదేరి వెళ్లారు.

అద్వానీ తన పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ను, అటార్నీ జనరల్‌ జాన్‌ ఆష్క్రాఫ్ట్‌ను కలుసుకుంటారు. ఆయన అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ను కూడా కలుసుకునే అవకాశాలున్నాయి.

అద్వానీతో పాటు హోం శాఖ కార్యదర్శి కమల్‌ పాండే, ఇంటలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ కె.పి. సింగ్‌, హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికాకు బయలుదేరి వెళ్లింది.

ఈ సందర్భంగా అద్వానీ న్యూయార్క్‌ మేయర్‌, గవర్నర్‌ను, అమెరికా కమ్యూనిటీ గ్రూప్‌లను, తదితరులతో సమావేశమవుతారు. ఆయన మేధావులతో, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో కూడా సమావేశమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+