మెదక్ మెడలో బాబు వరాలమాల
మెదక్‌ః 16వ విడత జన్మభూమి ఏడో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లా దుబ్బాకలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించే వరకు జన్మభూమి ఆగదని ఆయన ప్రకటించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను అధికారును ముందుంచుకొని నేరుగా ప్రజలతో చర్చించడం ఆసక్తి కలిగించింది. ప్రజలు ముఖ్యంగా యువకులు చంద్రబాబు నాయుడుకు సమస్యలను ఏకరవు పెట్టారు. తెలంగాణా వాదం బలంగా వున్న దుబ్బాక ప్రాంతంలో ప్రజలను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారు.
తన వద్ద కూర్చున విద్యార్థులందరి పేర్లు నోట్ చేసుకొని వారిని బ్రిడ్జి స్కూలు లేదా గురుకుల పాఠశాలల్లో చేర్పించాలని, అవసరమైతే వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందిచాల్సిందిగా చంద్రబాబు కలెక్టర్ ను ఆదేశించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన చంద్రబాబు గ్రామసభ ఆద్యంతం రసవత్తరంగా సాగింది.












Click it and Unblock the Notifications