బెజవాడ పాపిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: సోషలిస్టు నాయకుడు, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ అనుచరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బెజవాడ పాపిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

అస్వస్థత కారణంగా ఇక్కడి అపోలో ఆస్పత్రిలో చేరిన పాపిరెడ్డి సోమవారం సాయంత్రం మరణించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1958 నుంచి 1962 వరకు శాసనమండలి సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు అల్లూరు శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు రాజసభ సభ్యుడిగా పని చేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో తెలుగుదేశం తరఫున అల్లూరు నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. బెజవాడ పాపిరెడ్డి మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+