పోలీసు వేధింపులతో యువకుడి ఆత్మహత్య
నంద్యాల: పోలీసుల వేధింపులను తట్టుకోలేక ఒక యువకుడు లాడ్జీపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం సాయంత్రం వందలాది మంది చూస్తుండగా ఈ సంఘటన జరిగింది.
అంతటితో ఆగకుండా రమేష్ తల్లి హుసేనమ్మను కూడా ఇంటరాగేషన్ కోసమంటూ తీసికొని వెళ్లుతుండగా రమేష్ అడ్డు పడ్డాడు. తనను తీవ్రంగా కొట్టారని, పోలీసులు తన తల్లిని కూడా కొడతారని, ఇక తను బతకనని అంటూ లాడ్జి పైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లూ పారిపోయారు.
రమేష్‌బాబు ఆత్మహత్య చేసుకోవడానికి తమ పోలీసులు చేసిన తప్పే కారణమని జిల్లా ఎస్పీ సీతారామాంజనేయులు అన్నారు. రమేష్ ఆత్మహ్యతకు కారకులైన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ తరుణ్‌ను, నంద్యాల టూటౌన్ పోలీసుల స్టేషన్ కానిస్టేబుల్ మహబూబ్ బాషాను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications