భారత త్రివిధదళాలపై జైషే గురి
శ్రీనగర్‌ః భారత త్రివిధ దళాలపై దాడులు చేస్తామని పాకిస్థాన్ ప్రధాన కేంద్రం పనిచేసే జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ లోని జైషేమహమ్మద్ అధినేత అబూ హజ్రత్ స్థానిక వార్తా సంస్థ నాఫాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్య్యూలో ఈ హెచ్చరిక చేశారు. ఇప్పుడు మేం భారత నౌకా, వైమానిక, రక్షణ దళాలపై దృష్టి సారిస్తాం అని మంగళవారం ఆయన హెచ్చరించారు.
భారత పార్లమెంటుపై జరిగిన దాడికి సూత్రధారిగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్న గాజి బాబాతో తమకు ఏ విధమైన సంబంధాలు లేవని ఆయు చెప్పారు. బాబా జైషే మహమ్మద్ సభ్యుడు కాడని ఆయన తేల్చి చెప్పారు. కాశ్మీర్ పార్లమెంటుపై దాడి చేసినట్లు ముందుగా ప్రకటించుకొని ఆ తరువాత మాటమార్చిన విషయంపై ఆయన సమాధానాన్ని దాటవేశారు. పాక్ ప్రభుత్వం జీహాద్ గ్రూపుల పట్ల తన వైఖరిని మార్చుకున్నప్పటికీ తమకు వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. జైషే మహమ్మద్ సంస్థలో ఐదువేల ఆత్మాహుతి దళాలతో పాటు 12 వేల మంది తీవ్రవాదులు వున్నారని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications