తెగని దేశం-బిజెపి పంచాయతీ!
హైదరాబాద్‌ః మినీ మున్సిపల్ సమరంలో హైదరాబాద్ లో ఏదో విధంగా సర్దుబాటు చేసుకున్న తెలుగుదేశం-బిజెపి పార్టీలు మిగిలిన చోట్ల పొత్తుకు నానాతంటాలు పడుతున్నాయి. తిరుపతి, హిందూపూర్, రాజమండ్రిలలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నప్పటికీ పొత్తు వ్యవహారంలో దేశం-బిజెపి ఇంకా ఓ దారికి రాలేదు. రాజమండ్రిలో పొత్తు వ్యవహారం తేలకపోవడంతో బిజెపి నేతలు అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధమని ప్రకటించారు. దీంతో బిజెపి రాష్ట్రనేత చలపతిరావును అధిష్టానం హుటాహుటిన రాజమండ్రి పంపింది. మంగళవారం రాత్రికి పొత్తు విషయంలో ఓ అంగీకారం కుదురుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications