రాష్ట్రాల నిర్లక్ష్యంపై వాజ్ పేయి గరం
న్యూఢిల్లీః విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రాలు నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తున్నాయంటూ ప్రధాని వాజ్ పేయి దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలపై ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 11 రాష్టాలు మాత్రమే రెగ్యులేటరీ కమిషన్లు ఏర్పాటు చేయడం నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతున్నదని వాజ్ పేయి అన్నారు. 28 రాష్ట్రాల్లో కేవలం 11 రాష్ట్రాలు మాత్రమే కొంతవరకు విద్యుత్ సంస్కరణలు చేపట్టాయని, మిగిలిన రాష్ట్రాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో విద్యుత్ సంస్కరణలు అమలు జరగడం లేదని వాజ్ పేయి అన్నారు. శుక్రవారం కొత్తఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా రాజకీయాలు, బ్యూరోక్రసీ విద్యుత్ సంస్కరణలకు అవరోధంగా పరిణమించడం విచారకరమన్నారు.












Click it and Unblock the Notifications