దారి తప్పిన సిఎం హెలికాప్టర్
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శుక్రవారం దారి తప్పింది. దాదాపు అర గంట సేపు హెలికాప్టర్ ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. అరగంట ఆలస్యంగా ముఖ్యమంత్రి జన్మభూమి గ్రామ సభకు హాజరయ్యారు.
పెద్దముడియం 28 డిగ్రీల అక్షాంశంపై ఉన్నదని పైలట్ నోట్ చేసుకున్నాడు. దీంతో హెలికాప్టర్ గం. 11.15 నిమిషాలకే పెద్దముడియం దాటి వెళ్లింది. హెలికాప్టర్ దువ్వూరు దాటి తెలుగుగంగ పనులు అమలవుతున్న కొండల్లో చక్కర్లు కొడుతుండగా హెలికాప్టర్‌లో వున్న భద్రతాధికారి అబ్రహం లింకన్‌కు అనుమానం వచ్చింది. ఆళ్లగడ్డ దాడిపోయినా పెద్దముడియం రాకపోవడంతో వైర్‌లెస్ సెట్ ద్వారా పెద్దముడియంలో ఉన్న ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బందితో మాట్లాడారు. అతి కష్టం మీద పెద్ద ముడియం వివరాలు తెలుసుకుని హెలికాప్టర్‌ను పెద్ద ముడియంకు తీసుకురాగలిగారు.












Click it and Unblock the Notifications
