దీపావళి వేళ దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు.. పలువురు మృతి, కోట్లలో నష్టం!

దీపావళి పండుగ వేళ దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల నడుమ పలు నగరాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బాణాసంచా కాల్చే సమయంలో ఎగిరిపడిన నిప్పురవ్వల వల్ల దుకాణాలు, కర్మాకారాలు, బహుళ అంతస్తుల భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క పుణె నగరంలోనే అత్యధికంగా 63 అగ్నిప్రమాదాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.

దీపావళి రోజున తెగిపడిన భార్య తల.. కాళీమాత గుడిలో ఒళ్ళు గగుర్పాటు సీన్ !!
దీపావళి రోజున తెగిపడిన భార్య తల.. కాళీమాత గుడిలో ఒళ్ళు గగుర్పాటు సీన్ !!

బాలుడి పొట్టలోకి రాకెట్.. ఇద్దరు వ్యక్తులు సజీవదహనం
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో పండుగ వేడుకలు ఒక ఇంట్లో తీవ్ర శోకాన్ని నింపాయి. బాణాసంచా కాలుస్తున్న సమయంలో పదేళ్ల బాలుడి పొట్టలోకి రాకెట్ బాంబు బలంగా దూసుకువచ్చి తాకడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఫాల్నా ప్రాంతంలో బాణాసంచా దుకాణంలోకి నిప్పురవ్వలు పడటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

Diwali Fire Accidents Across India 3 People Dead Massive Property Loss Reported destroying factories and shops

దేశవ్యాప్తంగా అగ్నిప్రమాదాల బీభత్సం.. ప్రముఖ ఘటనలు
మహారాష్ట్ర(ముంబై, పుణె): పుణెలో 63 చోట్ల అగ్నిప్రమాదాలు జరగగా.. దళాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. ముంబైలోని దొంగ్రి ప్రాంతంలో 30కి పైగా దుకాణాలు, గుడిసెలు తగలబడి దగ్ధమయ్యాయి. టీవీఎస్ షోరూమ్, మోటార్ గ్యారేజీలు మంటలకు బూడిదయ్యాయి.

తెలంగాణ(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాస్టిక్ తయారీ యూనిట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పక్కనే ఉన్న ఫ్లైవుడ్ తయారీ కేంద్రానికి వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది.

ఢిల్లీ: నజఫ్‌గఢ్‌లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నికీలలు నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. 25 అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపు చేశాయి. గాజియాబాద్‌లోని విజయనగర్ ప్లాస్టిక్ కంపెనీతో పాటు సీహెచ్-7 సొసైటీలోని 10వ అంతస్తూ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్: జమ్మూలోని నెహ్రూ మార్కెట్‌లో వంటనూనె దుకాణాల్లో మంటలు చెలరేగి 12 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఉత్తరప్రదేశ్ బందాలోని స్క్రాప్ గోదాంలో రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

కుమారుడి ఫేస్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు దీపావళి సర్ ప్రైజ్..
కుమారుడి ఫేస్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు దీపావళి సర్ ప్రైజ్..

బీహార్, హర్యానా, పశ్చిమ బెంగాల్: పాట్నాలోని స్టీల్ గోదాం, హర్యానా సోనిపట్‌లోని జ్యూసర్-మిక్సర్ ఫ్యాక్టరీ, పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని గోదాములు మంటల్లో కాలిపోయాయి.

పలు రాష్ట్రాల్లో అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనేక చోట్ల ఘటనలకు కారణం బాణాసంచా రవ్వలేనని ప్రాథమికంగా గుర్తించినప్పటికీ.. అధికారిక విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+