సిడ్నీః ప్రపంచ నేతలు పలువుర్ని ఒకేసారి హతమార్చేందుకు అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌లాడెన్ కుట్రపన్నినట్టుగా తెలుస్తోంది. ఒక గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా మారణహోమం సృష్టించేందుకు లాడెన్ పథకం రచించినట్టుగా వెల్లడయింది.
ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు ఈ మేరకు వీడియో టేపు సాక్ష్యం లభించింది. ఈ టేపులో ఆల్‌ఖైదా టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చిన దృశ్యం కూడా వుంది. ప్రముఖులను కిడ్నాప్ చేసి బందీలుగా ఉంచడం ఎలా అన్న అంశంపై కూడా రిహార్సల్ చేయడం కూడా టేపులో చిత్రీకరించారు. రిహార్సల్స్ కోసం బందీగా తెచ్చిన వ్యక్తిని తీవ్రవాదులు కాల్చిచంపడాన్ని కూడా టేపులో చూపారు. గోల్ఫ్ బ్యాగుల్లో ఆయుధాలు తరలించడం రాకెట్ ప్రొపెల్డ్ గ్రేనెడ్లతో నేతలను హతమార్చడం అల్ ఖైదా కుట్రలో భాగమని అధికారులు తెలిపారు