కలకత్తాః
ఇంగ్లాండ్‌తో
వన్డే
సిరీస్
సందర్భంగా
ఈడెన్‌గార్డెన్స్‌లో
జరిగిన
తొలిమ్యాచ్‌లో
భారత్
నిర్ణీత
50
ఓవర్లలో
8
వికెట్ల
నష్టానికి
281
పరుగుల
భారీ
స్కోర్
చేసింది.
తొలుత
బ్యాటింగ్
దిగిన
భారత్
తరఫున
సచిన్,
గంగూలీ
ఓపెనర్స్‌గా
బరిలోకి
దిగారు.
ఈ
ఇద్దరు
మంచి
ఆరంభాన్నే
అందించారు.
గంగూలీ
58
బంతుల్లో
42
పరుగులు
చేసి
ప్లింటాఫ్
బౌలింగ్‌లో
భారీ
షాట్
కొట్టబోయి
కాచ్
ఇచ్చాడు.
సచిన్
43
బంతుల్లో
36
పరుగులు
చేసి
ప్లింటాఫ్
బౌలింగ్‌లో
క్లీన్‌బౌల్డ్
అయ్యాడు.
ఈ
దశలో
బ్యాటింగ్‌కు
వచ్చిన
దినేష్
మోంగియా,
వివిఎస్
లక్ష్మణ్‌లు
ధాటిగా
ఆడి
పరుగులవరద
సృష్టించారు.
58
బంతుల్లో
47
పరుగుల
భాగస్వామ్యంతో
ఆటను
రసవత్తరంగా
మార్చారు.
మోంగియా
చెలరేగి
ఆడుతూ
75
బంతుల్లో
71
పరుగులు
చేసి
భారత్‌ను
భారీ
స్కోర్
దిశగా
నడిపించారు.
మోగింయాకు
చక్కని
సహకారాన్నిఅందించిన
లక్ష్మణ్
25
పరుగులు
చేసి
కవర్స్‌లో
క్యాచ్
ఇచ్చిపెవీలియన్
దారి
పట్టారు.
వీరేంద్ర
సెహ్వాగ్
తొలిబంతినే
బౌండరీకి
తరలించి
మంచి
ఊపుమీద
వున్నట్టుగా
కనిపించారు.
29
పరుగుల
తర్వాతసెహవాగ్
ఔట్
అయ్యారు.
ఆ
తర్వాత
వచ్చిన
హేమాంగ్
బదానీ
దూకుడుగా
ఆడి
32
బంతుల్లో
35
పరుగులు
చేశారు.
చివరగా
వచ్చిన
ఆగార్కర్,
అజయ్
రాత్రాలు
రెండేసి
పరుగులు
చేసి
ఔటయ్యారు.
హర్బజన్‌సింగ్
18
పరుగులతో,
శ్రీనాథ్
రెండు
పరుగులతో
నాటటౌగా
వున్నారు.ఇదిలా
వుండగా
భారత్
విధించిన
లక్ష్యాన్ని
అధిగమించేందుకు
బ్యాటింగ్
ప్రారంభించిన
ఇంగ్లాండ్
ఆటప్రారంభించిన
కొద్ది
సేపట్లోనే
రెండు
వికెట్లు
కోల్పోయింది.
ఈ
వార్తరాసే
సమయానికి
15
ఓవర్లలో
బ్రిటన్
90
పరుగులతో
వుంది.