ఎన్రాన్ ఛైర్మన్ రాజీనామా
హూస్టన్‌ః ఎన్ రాన్ ఛైర్మన్, సి.ఇ.ఓ కెన్నెత్ ఎల్. లె తన పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. రుణదాతలఅంగీకారం మేరకు బోర్డుతో చర్చలు జరిపాక తాను రాజీ నామా చేయాలని నిర్ణయించినట్లు ఎన్రాన్ కార్పొరేషన్ చైర్మన్ లే వెల్లడించారు. ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ ఎన్రాన్ కొద్ది రోజులుగాసంక్షోభంలో పడిన విషయం విదితమే. ఎన్రాన్ బతకి బట్టకట్టాలన్నదే నా లక్ష్యం..... కంపెనీ పరువు ప్రతిష్ఠలు... అహర్నిశలు కృషి చేసే ఉద్యోగులను కాపాడే వ్యక్తి చైర్మన్ గా బాధ్యతలుస్వీకరిస్తారని ఆశిస్తానని లే అన్నారు.












Click it and Unblock the Notifications
