ఇన్ శాట్ 3సి ప్రయోగంసక్సెస్
బెంగుళూరుః భారత అంతరిక్షపరిశోధనా రంగంలో మరో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. ఆధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్ శాట్ 3సిని ఫ్రాన్స్ లోని గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ప్రయోగించారు. నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ఏరియన్ - 4 ఉపగ్రహ వాహక నౌక 2,750 కిలోల బరువున్న ఇన్ శాట్ 3సి ని తీసుకొని గగనతలంలోకి దూసుకువెళ్ళింది.అరగంట తరువాత ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్ శాట్ 3సి లోని మాస్టర్ కంట్రోల్‌ఫెసిలిటీ చక్కగా పనిచేస్తున్నదని, ఉపగ్రహం నుంచి సంకేతాలుఅందడం ప్రారంభించాయని కర్నాటక లోని హసన్ అంతరిక్షపరిశోధనా సంస్థ అధికారులు వెల్లడించారు.
ఇన్ శాట్ 3సి ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ కస్తూరి రంగన్ హసన్ లోవిలేకరుల సమావేశంలో చెప్పారు. 24 సి బాండ్‌ట్రాన్స్ పౌండర్లు, ఆరు విస్తృత పరిధి గల సి బాండ్‌ట్రాన్స్ పౌండర్లు, రెండు ఎస్ బాండ్ ట్రాన్స్ పౌండర్లు, ఒక మొబైల్ శాటిలైట్‌సర్వీస్ ట్రాన్స్ పౌండర్ లు వున్న ఈ ఉపగ్రహం ఇన్ శాట్ 1డి కి తూర్పు రేఖాంశలో వుండే విధంగా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications
