ప్రాంతీయ సుస్థిరతకు భగ్నం: పాక్
ఇస్లామాబాద్: భారతఅగ్ని- 3 క్షిపణి ప్రయోగంపై పాకిస్థాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇది ప్రాంతీయ సుస్థిరతనుదెబ్బ తీస్తుందని పాకిస్థాన్ వ్యాఖ్యానించింది.
పాకిస్థాన్ సంయమన విధానాన్ని అనుసరిస్తోందని పాక్ స్పష్టం చేసింది. ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో, అదీ తమ సరిహద్దుల్లో భారత బలగాలు మోహరించిన సమయంలో ఈ ప్రయోగం జరిగిందని పాకిస్థాన్ అన్నది. దీన్ని ఎదుర్కోగల సత్తా తమకు వున్నదని పాకిస్థాన్ అన్నది.
పాకిస్థాన్ భయాలను భారత్ త్రోసి పుచ్చింది.అగ్ని పరీక్ష ప్రాంతీయ సుస్థిరతను దెబ్బ తీస్తుందనే పాకిస్థాన్విమర్శను ఖండించారు. గత రెండు రోజుల్లో ఈవిషయాన్ని తాము జర్మనీ, ఫ్రాన్స్, పాకిస్థాన్‌లకు, ఐదుగురు సభ్యులు గల ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి తెలియజేశామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నిరుపమా రావు చెప్పారు.












Click it and Unblock the Notifications
