చంద్రబాబుకు తానా, ఆటా సత్కారం
న్యూయార్క్‌ః అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అమెరికాలోని తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించాయి. అసోసియేషన్ ఆఫ్ తెలుగు అమెరికన్స్(ఆటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లు సంయుక్తంగా చంద్రబాబు నాయుడును శనివారం నాడు న్యూయార్క్ లోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో ఘనంగా సత్కరించాయి. తానా అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, ఆటా అధ్యక్షురాలు సంధ్య, ఆటా వ్యవస్థాపకుడు మహేశ్వర ప్రసాద్ లు చంద్రబాబు నాయుడిని దుశ్శాలువాతో సత్కరించారు.












Click it and Unblock the Notifications
