"జనం నివ్వెరపోతున్నారు..!" - చంద్రబాబు కామెంట్స్ పై జగన్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పర్వం కొనసాగుతోంది. తాజాగా మున్సిపల్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అధికార కూటమి అత్యధిక స్ధానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ రాష్ట్రంలో మరింత వెనుకబడిపోయిందని, కూటమి మాత్రం పుంజుకుందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు వైసీపీని తిరస్కరించారని పేర్కొన్నారు. దీనిపై విపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) స్పందించారు.

ఏపీ ఉద్యోగులకు అలర్ట్..! పీఆర్సీ ఇచ్చే వరకూ వీటన్నింటికీ బ్రేక్..!
ఏపీ ఉద్యోగులకు అలర్ట్..! పీఆర్సీ ఇచ్చే వరకూ వీటన్నింటికీ బ్రేక్..!

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి హవాపై చంద్రబాబు పెట్టిన ప్రెస్ మీట్ పై స్పందిస్తూ వైఎస్ జగన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒక్కటేనని ఇందులో పేర్కొన్నారు. "రిగ్గింగ్ మాస్టర్" ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. చివర్లో హే రామ్.. సేవ్ ఆంధ్ర అంటూ జగన్ తన ట్వీట్ ను ముగించారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలపై పలుమార్లు విమర్శలు చేసిన జగన్.. ఇవాళ ఫలితాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకూ అదే విధంగా స్పందించారు.

YS Jagan Hits Back at Chandrababu s Remarks on Local Poll Results Says Public Is Shocked
టీడీపీ జడ్పీ ఛైర్మన్ కాబోతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! మధ్యలో జనసేన ట్విస్ట్ ..!
టీడీపీ జడ్పీ ఛైర్మన్ కాబోతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! మధ్యలో జనసేన ట్విస్ట్ ..!

వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ముందే ఇరు పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఇందులో పోలీసుల సాయంతో కూటమి నేతలు దాడులకు దిగడం, నామినేషన్లు అడ్డుకోవడం, పోలింగ్ బూత్ ల ఆక్రమణలపై వైసీపీ పలు మార్లు ఎస్ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. కూటమి నేతలు కూడా ఈ విమర్శలకు దీటుగా స్పందిస్తూ వచ్చారు. వైసీపీ అబద్దాల ప్రచారం చేస్తోందని ప్రతి విమర్శలు చేశారు. చివరకు ఎన్నికలు ముగియడం, కూటమి హవా కొనసాగడం, వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో వెనుకబడ్డా, పరిషత్ ఎన్నికల్లో దీటుగా జవాబివ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, జగన్ మాటల దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+