వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాతో కీలక రక్షణ ఒప్పందాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతున్న పోరుకు రష్యా పూర్తి మద్దతు ప్రకటించింది. భారత్‌ లో పర్యటిస్తున్న రష్యా ఉప ప్రధాని క్లెవనోవ్‌ శుక్రవారం ఉదయం ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు తీవ్రవాదం తదితర సమస్యలను కూడా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తీవ్రవాద నిర్మూలనకు భారత్‌ అవలంబిస్తున్న వైఖరిని క్లెవనోవ్‌ ప్రశంసించారు. భారత్‌ కోరిన 20 మంది తీవ్రవాదుల్ని పాకిస్తాన్‌అప్పగించాలని, తద్వారా చర్చలకు మార్గం సుగమం చేయాలని ఆయనకోరారు.

క్లెవనోవ్‌ ఆంతకుముందు భారత్‌ విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్‌సింగ్‌, రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ను కలుసుకున్నారు. ఆయుధాల తయారీవిషయంలో భారత్‌-రష్యాలు పరస్పరం సహకరించుకొనే ఒప్పందం కూడా క్లెవనోవ్‌ పర్యటన సందర్భంగా ఖరారైంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X