మార్చి 15నుంచి రామాలయ నిర్మాణం
అయోధ్యః మార్చి 15 నుంచి అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామనివిశ్వహిందూ పరిషత్ ఆదివారం ప్రకటించింది. రామ మందిర నిర్మాణంలో వున్న అవరోధాలను తొలగించాల్సిందిగా ప్రధాని వాజ్‌పేయికి అవసరానికి మించే సమయం ఇచ్చామని రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు రామచంద్ర పరమహంస అన్నారు. మార్చి 12 వరకుఇంకా ఎదురు చూస్తామని అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే వర్క్ షాప్ నుంచి రామమందిర నిర్మాణానికి రూపొందించిన పిల్లర్లను స్థలానికి తరలిస్తామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
