పాకిస్తాన్ ను నమ్మేది కల్లః వాజ్‌పేయి
భటిండాః అమెరికా జర్నలిస్టు కిడ్నాప్ వ్యవహారంలో భారత్ హస్తం వున్నదంటూ పాక్ సైనికాధ్యక్షుడు ముషారఫ్ వ్యాఖ్యానించడంపై ప్రధాని వాజ్‌పేయి తీవ్రంగా మండిపడ్డారు. తనపై నిందను మాపుకొనేందుకు భారత్ పై వేలు చూపించే ముషారఫ్ ను ఎవరూ నమ్మరని భటిండాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వాజ్‌పేయి విమర్శించారు. వాషింగ్టన్ పోస్ట్ కు ముషారఫ్ ఇంటర్వ్యూ ఇస్తూ అమెరికా జర్నలిస్టు కిడ్నాప్ లో భారత్ హస్తం వుందంటూ ఆరోపించారని, తన తప్పు కప్పుపుచ్చుకోవడానికి భారత్ పై ఆరోపణలు చేసే పాక్ ను ఎలా నమ్మాలని వాజ్‌పేయి అన్నారు.












Click it and Unblock the Notifications
