సమైక్యంగా దాడికివిపక్షాల వ్యూహం
హైదరాబాద్‌ః రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు ప్రధాన సమస్యలపై ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి టిఆర్‌ఎస్, టిఎస్‌ఎస్, ఎంఐఎం, సిపిఎం నేతలు హాజరయ్యారు. విద్యుత్, రైతుల సమావేశాలు, పోలీసుల జులుం వంటి అంశాలపై సమైక్యంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాల నేతలు నిర్ణయించారు. ప్రైవేట్ విద్యుత్‌కు రాష్ష్ర ఖజానాను దోచిపెడుతున్నారని వైఎస్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications
