ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర

న్యూఢిల్లీః దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ మద్దతున్న ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. కొత్తగా ఏర్పాటయిన హెజ్బ్‌ ఇ ఇస్లామీ తీవ్రవాద సంస్థ సభ్యుడొకరిని అరెస్టు చేయడంతో ఈ కుట్ర బట్టబయలయింది.

పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని కొడియా వూల్‌ వద్ద పేలుడు పదార్ధాలు అమర్చేందుకు మహమ్మద్‌ హనీఫ్‌ కల్సీ అనే ఈ ఉగ్రవాది బుధవారం ాత్రి ప్రయత్నించినప్పుడు పోలీసులు అతన్ని చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని నుంచి ఏడు కిలోల ఆర్‌డిఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా వుండగా కోల్‌కతాలోని అమెరికన్‌ సెంటర్‌పై దాడికి సంబంధించిన కేసులో మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరినీ జైపూర్‌లో అరెస్టు చేసి ఇంటరాగేషన్‌కో కోల్‌కతా తరలించారని తెలిసింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+