మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం
న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాంచల్ రాష్ట్రాలఅసెంబ్లీలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 403అసెంబ్లీ స్థానాల్లో 92 స్థానాలకు తొలివిడతగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ముందు జాగ్రత్త చర్యగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ్‌సింగ్, మాయావతి రెండేసి స్థానాల నుంచి ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు.
ఉత్తరాంచల్ రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు గురువారంఒకే సారి పోలింగ్ జరుగుతున్నది. రాష్ట్రంలోని 52 లక్షల మంది ఓటర్లు 927 మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు.












Click it and Unblock the Notifications
