భారత్ పాక్ చెలిమే అమెరికా ఆకాంక్ష
వాషింగ్టన్‌ః భారత పాక్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని,అందువల్ల దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్‌ఫీల్డ్ అభిప్రాయపడ్డారు. అమెరికా, పాకిస్తాన్ ల మధ్య చిరకాలస్నేహం వుంది... అది వ్యూహాత్మకమైన సంబంధం... ఈ సంబంధం వల్ల ఉభయదేశాలు పలు ప్రయోజనాలు పొందాయని రమ్స్‌ఫీల్డ్ అన్నారు. బుధవారం రమ్స్ ఫీల్డ్ పాక్ అధ్యక్షుడు ముషారఫ్ తో సమావేశమైన అనంతరంవిలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తోస్నేహం వున్నదంటున్నారు కదా... అవసరమైతే పాక్ కు ఆయుధ సాయంఅందిస్తారా అనే ప్రశ్నకు ఈ ప్రశ్న విదేశాంగ శాఖ మంత్రి కొలెన్ పావెల్ ను అడగండంటూ రమ్స్‌ఫీల్డ్ సమాధానాన్ని దాటవేశారు.












Click it and Unblock the Notifications
