ప్రగతికి సంస్కరణలే శరణ్యం
హైదరాబాద్‌ః ప్రపంచీకరణ శక్తుల ప్రాబల్యం, డబ్లుటివో ఒత్తిళ్లు, శరవేగంతో మారుతున్న టెక్నాలజీ, అన్నింటిని మించి ప్రపంచవ్యాప్తంగా నెలకొంటన్న ఆర్ధికమాంద్యం తెచ్చిపెట్టిన సవాళ్లను ఎదుర్కోవాలంటే సత్వరమే ఆర్ధిక సంస్కరణల రెండో దశను అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు శుక్రవారం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిని భవిష్యత్తుకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలను ఆయన వివరించారు. గవర్నర్ ప్రసంగం దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి శాఖకు లక్ష్యాలను నిర్ధేశించి ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టుగా ఆయన చెప్పారు. సంస్కరణలకు సంక్షేమానికి సమాన ప్రధాన్యత వుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో విజన్ 2020 లక్ష్యాలను చేరుకోవడం అంత తేలిక కాదనీ అయితే ప్రతి సంక్షోభం కొత్త అవకాశాలకు దారి ఇస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన ప్రాధాన్యం గల సమాజంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి గవర్నర్ తన ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారు.












Click it and Unblock the Notifications
