8 మంది చొరబాటుదారుల కాల్చివేత
జమ్మూః భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 8 మందిని శుక్రవారం వేకువజామున భద్రతా దళాలు కాల్చి చంపాయి. జమ్మూకు వాయువ్యంగా 240 కిలోమీటర్ల దూరంగా సరిహద్దు నుంచి అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు కొందరు ప్రయత్నించారు. వారిపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈకాల్పుల్లో ఎనిమిది మంది చొరబాటు దారులు మరణించారు. ఈవిషయాన్ని రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ రాజీవ్ లాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications
