పెదవి విరిచిన విపక్షాలు
హైదరాబాద్‌ఃః రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ రంగరాజ్ శుక్రవారం నాడు చేసిన ప్రసంగంపై విపక్షాలు పెదవివిరిచాయి. అనేక ముఖ్యమైన అంశాలను గవర్నర్ ప్రస్తావించన లేదని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరినీ కలవరపెడుతున్న విద్యుత్ సమస్య గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, పోలీసుల హింసాకాండ గురించి, పీపుల్స్‌వార్‌తో చర్చల గురించి గవర్నర్ ప్రసంగంలో ఊసు లేకపోవడాన్ని వారు ఆక్షేపించారు.
ఆత్మహత్యలు, డబ్లుటివో వల్ల రైతాంగం ఎదుర్కోనున్నసంక్షోభం గురించి ప్రస్తావనే లేదని సిపిఎం సభ్యుడు నోముల నర్సింహయ్యవిమర్శించారు. లక్ష్యాలను ఏకరువు పెట్టినప్పటికీ వాటిని ఏవిధంగా సాధిస్తారో మాత్రంవివరించలేదన బిజెపి నేత ఇంద్రసేనారెడ్డిపెదవి విరిచారు.












Click it and Unblock the Notifications
