న్యూయార్క్‌ః కాశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం కోసం పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినప్పటికీ పాక్ అధినేత ముషారఫ్ ఆశలు మాత్రం చల్లారలేదు.
అమెరికా ఈ ప్రతిపాదనకు నిర్ద్వంద్వంగా తిరస్కరించినప్పటికీ, భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కారంలోవిఫలమైనందున అమెరికా ప్రమేయం అవసరమని ముషారఫ్ మరోసారికోరారు.ఇదిలా వుండగా ముషారఫ్ అమెరికా పర్యటన సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా వెళ్లేప్పుడు మాత్రంస్వదేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు సాధ్యమైనంత తొందరలో ఏర్పాట్లు చేయాలని సుతిమెత్తగానే హెచ్చరించింది. భూరి సాయంఅందినప్పటికీ ఈ పర్యటన నుంచి పాక్ అధినేత ముషారఫ్ ఆశించిన ప్రయోజనాలను రాబట్టలేకపోయారు. కాశ్మీర్‌అంశంలో అమెరికా కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.