అసెంబ్లీలో పవర్ కట్ -విపక్షం గగ్గోలు
హైదరాబాద్‌ః అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ సభనుద్దేశించి ప్రసంగిస్తుండగా హఠాత్తుగా కరెంట్ పోవడంతో సభలో గగ్గోలు లేచింది. సాక్షాత్తూ గవర్నర్ ప్రసంగిస్తుండగా అందులోనూ వచ్చే జులై నుంచి కరెంట్ కోత వుండదని చెప్పడానికి కొద్ది సెకండ్ల ముందే పవర్ కట్ కావడం విశేషం. గవర్నర్ మైక్ హఠాత్తుగా మూగపోవడంతో సభ్యులంతా బిత్తరపోయారు. దాదాపు 30 సెకండ్లపాటు సభఅంధకారంలో వుంది. కాంగ్రెస్ సభ్యులంతా సిఎం షేమ్, సిఎం షేమ్ అని అరిచారు. కరెంట్ రాగానే ప్రసంగం కొనసాగించిన గవర్నర్ క్యాలిటీ పవర్ గురించి ప్రస్తావించగానే సభ్యులు మరోసారి షేమ్, షేమ్ అంటూ అరిచారు.












Click it and Unblock the Notifications
