త్రిపురానపై అసెంబ్లీలో రభస
హైదరాబాద్‌ః మహిళాశిశు సంక్షేమ సంస్థ సారధి త్రిపురాన వెంకటరత్నంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. మహిళాశిశు సంక్షేమ సంఘం పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదని మిత్రపక్షమైన బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. త్రిపురాన వెంకటరత్నం బోర్డు నిధులు నాలుగు కోట్ల రూపాయలను ఓ ప్రైవేటు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే అదికాస్తా బోర్డు తిప్పేసింది. ఇదే కాక పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. పదవీ కాలం పూర్తయినప్పటికీ త్రిపురాన వెంకటరత్నం ఆ పదవి నుంచి తప్పుకొనేందుకు ససేమిరా అన్నారు.












Click it and Unblock the Notifications
