ఫలించని భారత్‌బౌలింగ్‌ఃజింబాంబ్వే 248/8
నాగ్ పూర్‌ః భారత్ బౌలింగ్ లోపాలను సొమ్ము చేసుకొని జింబాంబ్వే బ్యాట్స్ మెన్ చెప్పుకోతగ్గ స్కోరు సాధించారు. 8వికెట్లు కోల్పోయి 248 పరుగులు సాధించారు. కెప్టెన్ కార్లయిల్ 75 పరుగులు సాధించగా మాజీ కెప్టెన్ క్యాంప్ బెల్ 50 పరుగులు చేశాడు. ఫ్రెండ్ 31 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్ గా వున్నాడు. మరో మాజీ కెప్టెన్ హీత్‌స్ట్రీక్ 21 పరుగులు సాధించి అవుటయ్యాడు. భారత్ బౌలర్లలో జహీర్‌ఖాన్ 3, కుంబ్లే 3 వికెట్లు సాధించగా, శ్రీనాధ్ కు ఒకవికెట్ లభించింది. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కువికెట్లేమీ లభించలేదు.












Click it and Unblock the Notifications