గంగూలీ విజృంభణ - భారత్ 319/6
న్యూఢిల్లీః ఫిరోజ్ షా కొట్లా మైదానంలో భారత కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఢిల్లీ యువకెరటంవీరేంద్ర సెహవాగ్ విజృంభంచారు. గంగూలీ టెస్టుల్లో తన ఏడోసెంచరీ పూర్తి చేసుకోగా సెహవాగ్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ మందకోడిగా సాగింది. ఉదయం ఆటంతా దాదాపు రద్దయింది. 171 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన గంగూలీ,సెహవాగ్ విజృంభించి ఆడారు.
19 పరుగులుతో కుంబ్లే నాటౌట్ గా నిలిచాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జింబాంబ్వే స్కోరు కంటే భారత్ ఇంకా 9 పరుగులు వెనకపడి వుంది. కాస్త నెమ్మదిగా ఆడిస్వల్ప ఆధిక్యం సంపాదించినా పిచ్ స్పిన్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి భారత్ కువిజయావకాశం వుంటుంది.












Click it and Unblock the Notifications