350కి చేరిన గుజరాత్ మృతులసంఖ్య
అహ్మదాబాద్‌ః గుజరాత్ మంటలు ఇంకా చల్లారలేదు. మతఘర్షణల మారణహోమంలో అమయాకులు కాలిబూడిదవుతున్నారు. అనధికారఅంచనాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వరకు 350 మంది మరణించినట్లు భావిస్తున్నారు. మతఘర్షణలు కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండడంతో వేలాది మందిసైన్యాలను రంగంలోకి దించుతున్నారు. వడోదరలోని ఓ బేకరీలో పనిచేసే ఏడుగురిని శనివారంఉదయం సజీవ దహనం చేశారు. మెహ్‌సేన జిల్లాలోని సర్దార్ పూర్ లో 27 మంది మతఘర్షణల్లోమరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.
నాలుగు రోజుల విధ్వంసానికి భయపడి ప్రజలుఇళ్ళ నుంచి బయటకు రావడం మానేశారని,పుకార్లతో ప్రజలు కలవరపడిపోతున్నారని పోలీసులువివరించారు. శుక్రవారం రాత్రి గోద్రా గ్రామంలో ఓవర్గానికి చెందిన 30 మందిని సజీవదహనంచేసిన సంఘటన సంచలనం కలిగించింది.












Click it and Unblock the Notifications