చెన్నై: అన్నాడియంకె నేత జయలలిత ముఖమంత్రిగా శనివారంనాడు ప్రమాణంస్వీకారం చేశారు. జయలలిత చేత ఉదయం 11 గంటలకు గవర్నర్ పి.యస్. రామమోహన్ రావు ప్రమాణం చేయించారు. దేవుడిపేర ఆమె తమిళంలో ప్రమాణం చేశారు.
యూనివర్శిటీసెంటెనరీ ఆడిటోరియంలో ఆమె ఆర్భాటంగా ప్రమాణం చేశారు. ఆమెతో పాటు 27 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఇంత వరకు ముఖ్యమంత్రిగా వున్న పన్నీర్‌సెల్వం ప్రజా పనుల మంత్రిగా నియమితులయ్యారు. జయలలిత తన మంత్రి వర్గంలోకి ఇద్దరు మహిళలను తీసుకున్నారు.