కోర్టు తీర్పును గౌరవిస్తాంః వి.హెచ్.పి.
న్యూఢిల్లీః అయోధ్య వ్యవహారంలో న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి వుంటామనివిశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. కోర్టు తీర్పువచ్చినా రాకపోయినా మార్చి 15న ఆలయనిర్మాణానికి సన్నాహాలు చేస్తామని మొండికేసిన వి.హెచ్.పి. గురువారం దిగివచ్చింది. అయోధ్యవివాదంపై న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తామంటూ వి.హెచ్.పి. గురువారం ప్రధాని వాజ్‌పేయికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది.
మార్చి 15న వివాదాస్పద స్థలానికి నిర్మాణ సామగ్రిన తరలిస్తారా అనివిలేకరులు ప్రశ్నించగా ఏ కార్యక్రమమైనా శాంతియుతంగా, భక్తిప్రపత్తులతో నిర్వహిస్తామని సింఘాల్ చాలా సౌమ్యంగా వెల్లడించారు. నిన్నటివరకు నిప్పులు చెరిగిన వి.హెచ్.పి.లో హఠాత్తుగా ఈ మార్పురావడానికి కారణం ఏమిటనేది ఆశ్చర్యంగా మారింది.












Click it and Unblock the Notifications
