కరెంట్ ఛార్జీలు తక్కువేపెంచాం: బాబు
హైదరాబాద్: సంస్కరణలు అమలు చేస్తున్నప్పుడు కరెంట్ ఛార్జీల సవరణ తప్పదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరెంట్ ఛార్జీలపెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో ఈ విధంగా అన్నారు.
కరెంట్ ఛార్జీలు ఎక్కువగా పెంచనందుకు ప్రతిపక్షాలు అసంతృప్తిగా వున్నాయని ఆయన చమత్కరించారు.సర్వీసు ఛార్జీలను పెంచడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు.విద్యుత్ రంగంలో సమర్థతను పెంచడం, ఛార్జీలను హేతుబద్దం చేయడం అవసరమని, సమర్థతను పెంచడం ద్వారా నాణ్యమైనసేవలు అందించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపడుతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు సత్యనారాయణరావు చెప్పారు. రెండేళ్ల కిందటి ఆందోళనను దృష్టిలో వుంచుకుని మరింత ఆచరణాత్మకంగా ఈ ఉద్యమాన్ని చేపడుతామని ఆయన చెప్పారు. ఎపిట్రాన్స్‌కో స్వయం ప్రతిపత్తి లేదని, ముఖ్యమంత్రి చెప్పినట్లుగానేట్రాన్స్‌కో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏ విధమైన చర్యా తీసుకోవడానికి సిద్ధంగా లేదని, ఆ ధైర్యం చంద్రబాబుకు వున్నదని ఆయన అన్నారు.
కరెంట్ ఛార్జీల పెంపును సిపిఐ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి దాసరి నాగభూషణరావు కూడావిమర్శించారు.












Click it and Unblock the Notifications