మత విద్వేష శక్తులను ఉపేక్షించం
హైదరాబాద్: మత సామరస్యానికి భంగం కలిగించే శక్తులను ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుజరాత్‌లో గోద్రా దుర్ఘటన, తదనంతర విధ్వంసకాండ,విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) కార్యక్రమాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొందరు ముస్లిం ప్రముఖులు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంలో ఆయన ఆ మాటలు అన్నారు.
ముస్లిం మైనారిటీలు ప్రధాన స్రవంతి నుంచి దూరమయ్యే వాతావరణాన్ని కల్పిస్తున్నారని, ముస్లింల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని ముస్లిం ప్రముఖులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. టాడాను ప్రయోగించినట్లే పొటోను కూడా ముస్లింలపై ప్రయోగించే ప్రమాదం వున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications