దారి తప్పినజాతీయ ఎజెండా: పివి
గుంటూరు: జాతీయ ఎజెండాను ఆర్థిక రంగం వైపు మళ్లించాల్సిన అవసరం ఉన్నదని మాజీ ప్రధానిపి.వి. నరసింహారావు అన్నారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సోమవారం నాడు ప్రసంగించారు.
తన ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఎజెండాను పక్కనపెట్టారని ఆయన చెప్పారు. ఇదే పద్ధతి కొనసాగితే దేశానికి చేటు కాలం దాపురిస్తుందని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు, మత సామరస్యానికి సంబంధించిన సమస్యలు ముందుకు వస్తుంటే ప్రశాంతంగా కూర్చుని చేయాల్సిన పనుల గురించి ఆలోచన వుండదని, ఆలోచన ఉన్నా ఆ పనులు చేయలేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications