వి.హెచ్‌.పి. పై ఫరూఖ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: రాష్ట్రంలో చర్చలకు అనువైన శాంతియుత వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం కాల్పులవిరమణను ప్రకటించాలని నిషిద్ధ పీపుల్స్‌వార్‌ డిమాండ్‌ చేసింది. గాలింపులు, వేధింపులు, ఎన్‌కౌంటర్ల వంటివి నిలిపేయాలని కూడా డిమాండ్‌ చేసింది. అప్పుడే అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సాఫల్యత చేకూరుతుందని అభిప్రాయపడింది.

చర్చల ప్రక్రియపైపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటన చేశారు. నిజమైన శాంతియుత వాతావరణం కల్పించడం ద్వారా మాత్రమే చర్చల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.చర్చలకు అనువైన వాతావరణం కల్పించేవిషయంలో నిర్దిష్టంగా చేపట్టబోయే కార్యక్రమాలు ఏమిటో స్పష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం కాల్పుల విరమణను అమలు జరిపినంత కాలం తాము కూడావిరమణను అమలు చేస్తామని ఆయన చెప్పారు. మార్చి 22వ తేదీ అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చర్చల ప్రక్రియలో ముందడుగుగా భావిస్తున్నామని, ఈవిజయం ప్రజలదేనని ఆయన అన్నారు. అయితే అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నాలుగు ముఖ్య నిర్ణయాల్లో చర్చలకు అవసరమై, సానుకూలమైన శాంతియుత వాతావరణాన్ని ఏర్పర్చాలి అనే నిర్ణయం నిర్దిష్ట రూపంలో లేదని తాము భావిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు.

చర్చలకు పరిస్థితి పరిపక్వమవుతున్న సమయంలోనే తుపాకులగూడెం వద్ద 12 మందిని ఎన్‌కౌంటర్‌ చేసి చర్చలకు ఇదేమీ ఆటంకం కాదంటూ చేసిన ప్రకటన బాధ్యతా రహితమైనదని, ఇదే తమను మరింత ఆలోచింపజేస్తోందని ఆయన అన్నారు. ఈ దృష్ట్యానే రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పడడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా కాల్పులవిరమణను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+