గుజరాత్‌లో ఆగని హింసకాండ
అహ్మదాబాద్: గుజరాత్‌లో అల్లర్లు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ అల్లర్లో ఐదుగురు మరణించారు. ఈ ఐదుగురిని సజీవ దహనం చేశారు. అల్లర్లు రాష్ట్రంలోని కొత్త ప్రాంతాలకుపాకాయి.
నవాబ్‌వాడ- పాట్నీ ప్రాంతంలో తనపై జరిగిన యాసిడ్ దాడి నుంచి బరోడా నగర పోలీసు కమిషనర్ తప్పించుకున్నారు.అంజార్‌లో హింస చెలరేగడంతో గాంధీదామ్, హజీపిర్‌లలో ఉద్రిక్తత నెలకొంది.
ఆనంద్ జిల్లాలోని ఉమ్రేత్ పట్టణంలో దుకాణాలను దగ్ధం చేశారు. రాళ్లు రువ్వారు.అంక్లేశ్వర్ పారిశ్రామిక పట్టణంలో విధ్వంసం, లూటీలు జరిగాయి. ఈ మూడు పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.
అహ్మదాబాద్‌లోని గోమతిపురా ప్రాంతంలో అల్లరి మూక దుకాణాలను, ఇళ్లను దగ్ధం చేసింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. దరియాపూర్, కాలుపూర్, షరాన్‌కోట్ ప్రాంతాల్లో రాళ్లు రువ్వుతున్న మూకపై పోలీసులు కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications